Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • ఇండియా టైమ్‌లైన్ ప్రకటన
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె GT 6T స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు జీటీ సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ని అఫీషియల్ గా వెల్లడించారు. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్

సోషల్ మీడియాలో ఒక యూజర్ Realme GT 7 Pro ఇండియా లాంచ్ ఎప్పుడని చేస్ జూ ని ప్రశ్నించగా, ఆయన ఈ ఏడాది భారత్ లో జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని బదులిచ్చారు. ఈ ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. అంటే అదే సమయంలో భారత్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.

త్వరలో Realme GT 6 గ్లోబల్ లాంచ్

మరోవైపు రియల్మీ సంస్థ, రియల్మీ జీటీ 6 డివైజ్‌ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ పై ఇంకా ప్రకటన రాలేదు.

రియల్మీ సంస్థ తన గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా Realme GT 6 గ్లోబల్ లాంచ్‌ని టీజ్ చేసింది. అయితే లాంచ్ తేదీని వెల్లడించలేదు. వచ్చే నెలలో లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టీజర్ పోస్ట్ లో కెమెరా స్పెసిఫికేషన్స్, డివైజ్ పేరుని కంపెనీ షేర్ చేసింది.

ఈ ఫోన్ 47ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఎఫ్/2.0 అపర్చర్, 1/100s షటర్ స్పీడ్, ఐఎస్ఓ 320 వంటి ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Realme GT 6 ఇదివరకు ఎఫ్‌సీసీ మరియు యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Realme GT 6 డివైజ్ గీక్‌బెంచ్ పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 735 జీపీయూ, 16జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.

Realme GT 6 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

రియల్మీ జీటీ 6 ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందింది. అంటే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.