Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో

Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 1.5కే మైక్రో-కర్వ్‌డ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ చేయబోతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. రియల్మీ జీటీ 7 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది. అయితే టిప్‌స్టర్ నేరుగా ఫోన్ పేరును కన్ఫర్మ్ చేయలేదు. కానీ, కామెంట్స్ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

లీక్ ప్రకారం, Realme GT 7 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme GT 7 Pro డివైజ్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుంది.

Realme GT 7 Pro డివైజ్ ఎక్స్‌ట్రా లార్జ్ సిలికాన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో సింగిల్-పాయింట్ అల్ట్రా‌సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో రానున్నట్లు లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఇతర ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ లో కూడా డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన Realme GT 5 Pro డివైజ్‌కి సక్సెసర్‌గా Realme GT 7 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్ లో రియల్మీ జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.