Realme GT 6T: భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్

Highlights

  • Realme GT 6T కొత్త కలర్ లాంచ్
  • జులై 20 నుంచి సేల్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం భారత్‌లో Realme GT 6T అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. తాజాగా మిరాకిల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను రియల్మీ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రేజర్ గ్రీన్ మరియు ఫ్లూయిడ్ సిల్వర్ కలర్స్ కి తోడుగా మిరాకిల్ పర్పుల్ జత చేరింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 6T ధర, లభ్యత

Realme GT 6T మిరాకిల్ పర్పుల్ కలర్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

Realme GT 6T మిరాకిల్ పర్పుల్ కలర్ వేరియంట్ జులై 20వ తేదీ నుంచి అమెజాన్ మరియు రియల్మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. అన్ని కలర్ వేరియంట్స్‌పై రూ.4,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ని రియల్మీ అందిస్తోంది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్

Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 1.5కే (2780*1264 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1600 నిట్స్ బ్రైట్నెస్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్, ఎస్జీఎస్ ఏఐ ఐ-ప్రొటెక్షన్ స్క్రీన్, ఎస్జీఎస్ ఏ-గ్రేడ్ సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

Realme GT 6T డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ LPDDR5X ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి UFS 4.0 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.

Realme GT 6T డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది.

Realme GT 6T లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

Realme GT 6T డివైజ్ 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

Realme GT 6T లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, ఐపీ65 రేటింగ్, 9-లేయర్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, జీటీ మోడ్ 5.0, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.