Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో భారత్‌లో Realme GT 6T లాంచ్
  • 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
  • మోడల్ నంబర్ RMX3853

Realme GT 6T ఇండియా లాంచ్‌ని రియల్మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్మీ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. లాంచ్‌కి ముందు Realme GT 6T డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ తో పాటు ఎన్బీటీసీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6T లిస్టింగ్ వివరాలు

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ లిస్టింగ్ పై RMX3853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ ఎన్బీటీసీ, బీఐఎస్, ఎఫ్‌సీసీ మరియు ఈఈసీ సర్టిఫికేషన్ లిస్టింగ్స్ పై కనిపించింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా 5360 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా బరువు, చుట్టుకొలతలు కూడా తెలిసాయి. జీటీ 6టీ 191 గ్రాముల బరువు, 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

కెమెరా ఎఫ్‌వీ-5 డేటాబేస్ పై Realme GT 6T లిస్ట్ అయ్యింది. దీని ద్వారా 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా రివీల్ అయ్యాయి.

Realme GT 6T లాంచ్ టైమ్‌లైన్

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ సేల్ కి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6T డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.