ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Realme GT 5

Highlights

  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న Realme GT 5
  • స్పెసిఫికేషన్స్ ని ఖరారు చేసిన రియల్మీ
  • తాజాగా లాంచ్ తేదీ ప్రకటన

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 28 న చైనాలో లాంచ్ అవుతోంది. ఇక తన 24జిబి ర్యామ్ ఫోన్ పై రియల్మీ సంస్థ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన Realme GT 3 డివైజ్ కి Realme GT 5 సక్సెసర్ గా వస్తోందని భావిస్తున్నారు. సరే, ఓసారి Realme GT 5 డిజైన్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme GT 5 డిజైన్ (లీక్)

  • ఇటీవలె లీకైన ఇమేజ్ ద్వారా Realme GT 5 డివైజ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తోందని అర్థమైంది.
  • Realme GT 5 లో సన్నని బెజెల్స్ ఉన్నాయి. సిమ్ స్లాట్, మైక్రోఫోన్, యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ ఫోన్ కి బాటమ్ లో ఉన్నాయి.
  • Realme GT 5 డివైజ్ ప్లాస్టిక్ కి బదులుగా మెటాలిక్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయని టిప్‌స్టర్ చెబుతున్నారు.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (ఖరారు)

  • రియల్మీ సంస్థ తన అధికార ప్రకటన ద్వారా త్వరలో రాబోవు Realme GT 5 డివైజ్ 24జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిపింది.
  • ఇంకా Realme GT 5 డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • అంతే కాదు, Realme GT 5 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో రానుందని సమాచారం.
  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ 1టిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme GT 5 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Realme GT 5 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme GT 5 రెండు బ్యాటరీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. బేస్ మోడల్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, మరొక వేరియంట్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.