Realme C63: 45W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ ఫోన్

Highlights

  • భారత్‌లో Realme C63 లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • డివైజ్ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme C63 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రావడం విశేషం. ఎంట్రీ లెవెల్ యూజర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ.8,999 గా ఉంది. ఈ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఓసారి Realme C63 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme C63 ధర, లభ్యత

Realme C63 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.8,999 గా నిర్ణయించారు. జులై 3వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.

Realme C63 డివైజ్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లెదర్ బ్లూ మరియు జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C63 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C63 డివైజ్ లో 6.75-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, మినీ క్యూప్సూల్ 2.0, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C63 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: Realme C63 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme C63 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme C63 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C63 లో డ్యూయల్ సిమ్, ఐపీ54 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, వై-ఫై 5 ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.