Realme C61 4G: జూన్ 28వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్న రియల్మీ సీ61

Highlights

  • Realme C61 4G లాంచ్ తేదీ ఖరారు
  • డివైజ్ ధర రూ.8,000 లోపే
  • 32ఎంపి సూపర్ క్లియర్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme C61 4G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 28వ తేదీన ఇండియాలో రియల్మీ సీ61 4జీ లాంచ్ అవుతోంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కోసం చూసేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. తాజాగా ఈ ఫోన్ వివరాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme C61 4G ఇండియా లాంచ్ వివరాలు

Realme C61 4G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జూన్ 28వ తేదీన లాంచ్ అవుతోంది. రియల్మీ సంస్థ తన అధికార వెబ్‌సైట్ లో ప్రొడక్ట్ పేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా డివైజ్ యొక్క ఇమేజెస్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలిసాయి.

Realme C61 4G ధర (లీక్)

Realme C61 4G స్మార్ట్‌ఫోన్ వివరాలను టిప్‌స్టర్ PassionateGeeks షేర్ చేశారు. ఈ ఫోన్ రూ.7,699 ధరతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు. ఇది 4జిబి ర్యామ్ మోడల్ ధర. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ డివైజ్ 64జిబి స్టోరేజీతో లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Realme C61 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Realme C61 4G లో హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme C61 4G డివైజ్ లో యూనిఎస్ఓసీ స్ప్రెడ్‌ట్రమ్ టీ612 చిప్సెట్ ఉంటుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Realme C61 4G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్‌ని కలిగి ఉంటుంది. యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C61 4G స్మార్ట్‌ఫోన్ లో 32ఎంపి సూపర్ క్లియర్ రియర్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ: Realme C61 4G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Realme C61 4G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్, టఫ్ గ్లాస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.