TDRA సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Realme C51; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న Realme C51
  • బీఐఎస్ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • 4880 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న హ్యాండ్సెట్

రియల్మీ సంస్థ తన సీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. ఇటీవలె, రియల్మీ కంపెనీ Realme C55, Realme C53 ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme C51 లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. బీఐఎస్ మరియు థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్ సైట్స్ పై లిస్ట్ అయిన తర్వాత తాజాగా Realme C51 డివైజ్ టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Realme C51 టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme C51 TDRA లిస్టింగ్ వివరాలు

లిస్టింగ్ ప్రకారం, Realme C51 డివైజ్ RMX3830 మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ డివైజ్ ఇదే మోడల్ నంబర్ తో ఇతర సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో పాటు, బీఐఎస్ సర్టిఫికేషన్ ని కూడా క్లియర్ చేసింది. దీంతో Realme C51 త్వరలోనే భారత్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది.

Realme C51 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • లిస్టింగ్‌లో ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ బయటకు రాలేదు. అయితే లిస్టింగ్‌కు ముందు డివైజ్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ వెల్లడించబడ్డాయి.
  • ఈ డివైజ్ 4G సపోర్ట్‌తో వస్తోందిన లీక్స్ ద్వారా తెలిసింది. ఇందులో డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే, ఇది 4880 mAh బ్యాటరీ మరియు 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే, Realme C51 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. కెమెరా సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 పై రన్ అవుతుంది.
  • ఫోన్ డిస్‌ప్లే గురించి చెప్పాలంటే, ఫోన్‌లో హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజ్ విషయానికొస్తే, Realme C51 డివైజ్ 4GB మరియు 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని సమాచారం.

Realme C51 ధర ఎంత ఉండవచ్చు?

ఇక ధర విషయానికి వస్తే, Realme C51 స్మార్ట్ ఫోన్ ధర వివరాలను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కంపెనీ తన తదుపరి అనౌన్స్‌మెంట్ లేదా టీజర్ ద్వారా Realme C51 కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.