POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 11వ తేదీన లాంచ్ కానున్న డివైజ్
  • 12జిబి+512జిబి స్టోరేజీతో వస్తోన్న M6 Pro 4G

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో M6 సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Pro 4G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జనవరి 11వ తేదీన POCO M6 Pro 4G గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే POCO M6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కాస్త చవకైన 4జీ వర్షన్ ని తీసుకొస్తున్నారు. సరే, ఓసారి POCO M6 Pro 4G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ

  • POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీని పోకో సంస్థ తన X ఖాతా మరియు అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ చేసింది.
  • POCO M6 Pro 4G డివైజ్ జనవరి 11 వ తేదీన రాత్రి 8 గంటలకు గ్లోబల్ గా లాంచ్ అవుతోంది.
  • POCO M6 Pro 4G డివైజ్ ఇప్పటికే యూఏఈ అమెజాన్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో ధర మరియు స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.
  • POCO M6 Pro 4G యూఏఈ అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఫోన్ ధర సుమారు రూ.20,000 ఉంటుందని తెలుస్తోంది. లాంచ్ సమయంలో దీని కంటే ఇంకా తక్కువ ధరే ఉండనుందని భావిస్తున్నారు.
  • POCO M6 Pro 4G కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. పర్పుల్, బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. త్వరలోనే ఇండియా లాంచ్ వివరాలను కూడా వెలువడే అవకాశం ఉంది.

POCO M6 Pro 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO M6 Pro 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 Pro 4G లో మీడియాటెక్ మీలియో జీ99 చిప్సెట్ వాడనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 Pro 4G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అలాగే వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.
  • కెమెరా: POCO M6 Pro 4G లో 64ఎంపి ఏఐ/ఓఐఎస్ మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: POCO M6 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO M6 Pro 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleSnapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+
Next articleMediaTek Dimensity 9300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo X100, Vivo X100 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.