POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో

Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.