OPPO Reno 12F 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెనో ఫోన్

Highlights

  • థాయిలాండ్‌లో Reno 12F 5G లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 12F 5G పేరుతో ఈ డివైజ్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G ధర

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ ధరను THB 11,999 గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీన్ని రూ.27,000 గా చెప్పవచ్చు.

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ ఆలివ్ గ్రీన్ మరియు అంబర్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12F 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ సపోర్ట్, 2100 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12F 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: OPPO Reno 12F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OPPO Reno 12F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OPPO Reno 12F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఓఎస్: OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12F 5G లో ఒప్పో ఏఐ ఫీచర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.