OPPO Reno 12 Series: జులై 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రెనో 12, రెనో 12 ప్రో?

Highlights

  • Oppo Reno 12 సిరీస్ లాంచ్ తేదీ జులై 12?
  • లైనప్‌లో వస్తోన్న రెనో 12, రెనో 12 ప్రో
  • 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో రెనో 12 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఒప్పో రెనో 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ జులై 12న ఇండియాలో లాంచ్ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు, ఒప్పో ఇండియా అధికార వెబ్‌సైట్ పై Reno 12 Series యొక్క ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది.

OPPO Reno 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

OPPO Reno 12 సిరీస్ భారతీయ మార్కెట్ లో జులై 12వ తేదీన లాంచ్ అవ్వనుందని TheTechOutlook వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ద్వారా రివీల్ అయ్యింది. అయితే ఒప్పో సంస్థ ఇప్పటి వరకు రెనో 12 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. జులై 12న లాంచ్ ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లైనప్ లో వస్తోన్న రెనో 12, రెనో 12 ప్రో డివైజెస్ ఏఐ టెక్నాలజీతో వస్తున్నాయి.

OPPO Reno 12 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO Reno 12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: OPPO Reno 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి జీసీ32ఈ2 కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.