OPPO: గ్లోబల్‌గా లాంచైన Reno 12, Reno 12 Pro

Highlights

  • యూరప్‌లో లాంచైన రెనో 12 సిరీస్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా OPPO Reno 12 సిరీస్ యూరప్ లో కూడా లాంచ్ అయ్యింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ఓసారి ఈ డివైజెస్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12 సిరీస్ ధర, లభ్యత

OPPO Reno 12 యొక్క 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 499 యూరోలు (సుమారు రూ.44,660) గా నిర్ణయించారు.

OPPO Reno 12 Pro యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 599 యూరోలు (సుమారు రూ.52,700) గా పెట్టారు.

OPPO Reno 12 ఆస్ట్రో సిల్వర్ మరియు మ్యాట్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. OPPO Reno 12 Pro డివైజ్ నెబులా సిల్వర్ మరియు స్పేస్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు ఈ నెల నుంచి యూకే తో పాటు ఇతర యూరప్ మార్కెట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

OPPO Reno 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: OPPO Reno 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి జీసీ32ఈ2 కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.