OPPO Reno 12 Pro: 50MP సెల్ఫీ కెమెరాతో లాంచైన రెనో 12 ప్రో

Highlights

  • భారత్‌లో రెనో 12 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన రెనో 12, 12 ప్రో
  • రెనో 12 ప్రో ధర రూ.36,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 12 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు డివైజెస్ ఒప్పో ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 12 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చింది. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OPPO Reno 12 Pro ధర

OPPO Reno 12 Pro యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.40,999 గా ఉంది. OPPO Reno 12 Pro డివైజ్ సన్‌సెట్ గోల్డ్ మరియు స్పేస్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ615 జీపీయూ ఇచ్చారు.

మెమొరీ: OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి.

కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెఎన్5 టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్ మరియు 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో వచ్చింది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ కెమెరాలో శాంసంగ్ ఎస్5కేజెఎన్5 సెన్సర్ వాడారు.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 Pro లో 360-డిగ్రీ డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీ, డ్యూయల్ 4కే అల్ట్రా-క్లియర్ వీడియో, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, ఏఐ ఎరేజర్ 2.0, లింక్ బూస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.