OPPO Reno 12 5G: భారత్‌లో లాంచైన ఒప్పో రెనో 12 5జీ

Highlights

  • భారత్‌లో OPPO Reno 12 5G సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన రెనో 12, రెనో 12 ప్రో
  • రెనో 12 5జీ ధర రూ.32,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో Reno 12 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 12 5G గురించి తెలుసుకుందాం. రెనో 12 5జీ సింగిల్ మెమొరీ వేరియంట్‌లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12 5G ధర, లభ్యత

OPPO Reno 12 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.32,999 గా నిర్ణయించారు. ఆస్ట్రో సిల్వర్, సన్‌సెట్ పీచ్ మరియు మ్యాట్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. జులై 25వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా OPPO Reno 12 5G ని కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, OPPO Reno 12 5G కొనుగోలుపై రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు, 9 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

OPPO Reno 12 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 5G లో 6.7-ఇంచ్ క్వాడ్ కర్వ్ ఇన్ఫినిటీ వ్యూ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10 ప్లస్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఏఆర్ఎమ్ మాలి-జీ615 జీపీయూ గ్రాఫిక్స్‌ని ఈ ఫోన్ లో వాడారు.

మెమొరీ: OPPO Reno 12 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO Reno 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO Reno 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ళు ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: OPPO Reno 12 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ65 రేటింగ్, ఏఐ ఫీచర్స్ ఉన్నాయి.

Previous articleOnePlus 12R: సన్సెట్ డ్యూన్ కలర్‌‌లో లాంచైన వన్‌ప్లస్ 12ఆర్
Next articleOPPO Reno 12 Pro: 50MP సెల్ఫీ కెమెరాతో లాంచైన రెనో 12 ప్రో
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.