లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G

Highlights

  • CPH2531 అనే మోడల్ నంబర్‌తో కనిపించిన OPPO Reno 10 5G
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 956, మల్టీ-కోర్ టెస్ట్ లో 2340 పాయింట్లు నమోదు
  • 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న OPPO Reno 10 5G

OPPO Reno 10 సిరీస్ జులై లో భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానుందని సమాచారం. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. తాజాగా OPPO Reno 10 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే రెనో 10 సిరీస్ లో టాప్ మోడల్స్ అయిన OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. సరే, ఓసారి OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G

  • OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ CPH2531 మోడల్ నంబర్ ని కలిగి ఉంది.
  • ఈ హ్యాండ్సెట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 956 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2340 పాయింట్లు నమోదు చేసింది.
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో OPPO Reno 10 5G డివైజ్ వస్తున్నట్లు లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
  • మదర్‌బోర్డ్ సెక్షన్ లో MT6877V అని పేర్కొని ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ కి సంబంధించినదని భావిస్తున్నారు.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 10 5G లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • కెమెరా: OPPO Reno 10 5G లో 64ఎంపి ప్రైమరీ ఒమ్నీవిజన్ ఓవీ64బి సెన్సర్, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఒక 32ఎంపి ఐఎంఎక్స్709 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.
  • ఓఎస్, కనెక్టివిటీ: OPPO Reno 10 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 10 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.