OPPO Reno 10 5G భారతీయ మార్కెట్ ధరను ప్రకటించిన కంపెనీ

Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన OPPO Reno 10 5G
  • లైనప్ లో వచ్చిన 3 రెనో సిరీస్ మోడల్స్
  • భారత్ లో OPPO Reno 10 5G ధర రూ.32,999

OPPO Reno 10 సిరీస్ రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా 3 మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G. తాజాగా ఒప్పో సంస్థ, OPPO Reno 10 5G డివైజ్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి OPPO Reno 10 5G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 10 5G ధర

OPPO Reno 10 5G డివైజ్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను రూ.32,999 గా నిర్ణయించారు. జులై 27 న OPPO Reno 10 5G సేల్ మొదలవుతుంది. డివైజ్ ని రిటైల్స్ స్టోర్స్ తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO Reno 10 5G సేల్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ద్వారా OPPO Reno 10 5G కొనుగోలు చేసే కస్టమర్లు రూ.3,000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొంటే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీని కూడా కంపెనీ అందిస్తోంది.

ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్, ఏయూ స్మాట్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా OPPO Reno 10 5G ని కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా 3-నెలల యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్, గూగుల్ వన్ ఉచితంగా లభిస్తాయి.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 10 5G డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • చిప్సెట్: OPPO Reno 10 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: OPPO Reno 10 5G డివైజ్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాలింగ్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleత్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ!
Next articleరూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.