Dimensity 7050 చిప్, 64MP కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 5G

Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • మార్కెట్ లోకి వచ్చిన మూడు మోడల్స్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరాతో ఎంట్రీ ఇచ్చిన OPPO Reno 10 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 10 5G గురించి తెలుసుకుందాం. OPPO Reno 10 5G మీడియాటెక్ 7050 చిప్, 64ఎంపి కెమెరాతో వచ్చింది. సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రెనో 10 5జీ లభించనుంది.

OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుంది. సరే, ఓసారి OPPO Reno 10 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
  • రియర్ కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

OPPO Reno 10 5G ధర, సేల్

OPPO Reno 10 5G డివైజ్ ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. జులై 20 వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఫోన్ ధరను ప్రకటించనున్నారు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ధర వివరాలు వెల్లడవుతాయి. OPPO Reno 10 5G డివైజ్ ఏయే కలర్ ఆప్షన్స్ లో లభించనుందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Previous article50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G
Next articleరూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.