OPPO F27 Pro: IP69 రేటింగ్‌తో వస్తోన్న ఒప్పో ఎఫ్27 ప్రో

Highlights

  • త్వరలో OPPO F27 Pro లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ ఇమేజ్
  • లెదర్ బ్యాక్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO F27 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇమేజ్ రివీల్ అయ్యింది. దీంతో డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. ఐపీ69 రేటింగ్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని 91mobiles కి సమాచారం అందింది. ఓసారి రివీలైన వివరాలను తెలుసుకుందాం పదండి.

IP69 రేటింగ్‌తో వస్తోన్న OPPO F27 Pro

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, OPPO F27 Pro ఐపీ69 రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఐపీ69 రేటింగ్ హయ్యస్ట్ గా ఉంది. భారత్ లో అందుబాటులో ఉన్న Galaxy S24, iPhone 15 డివైజెస్ వంటి అన్ని ఫ్లాగ్షిప్స్ ఐపీ68 రేటింగ్ తోనే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఒప్పో ఎఫ్27 ప్రో ఐపీ69 రేటింగ్ తో వస్తుండటం విశేషమని చెప్పాలి.

OPPO F27 Pro డివైజ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఇంకా డిస్ప్లే సైజ్ తదితర వివరాలు రివీల్ కాలేదు.

లీకైన ఇమేజెస్‌ని గమనిస్తే, OPPO F27 Pro బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ తో ఉన్నట్లు అర్థమవుతోంది. అలాగే బ్యాక్ ప్యానెల్ పై కాస్మస్ రింగ్ డిజైన్ ఉంది. ఇంకా బ్లూ కలర్ స్ట్రిప్ డివైజ్ కి మధ్యలో ఉండగా సైడ్స్ బ్లాక్ కలర్ ఫినిష్ తో ఉన్నాయి.

కెమెరా మాడ్యూల్ లో ఉన్న సెన్సర్స్ చుట్టూ బ్లూ కలర్ లో మెటల్ రింగ్ ఉంది. ఓవరాల్‌గా ఫోన్ చూడటానికి యూనిక్ గా ఉంది.

ఇంకా OPPO F27 Pro యొక్క లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. కానీ, జూన్ నెలలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

చివరగా గతేడాది ఫిబ్రవరిలో ఎఫ్-సిరీస్ లో OPPO F25 Pro భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. మరోసారి ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.