రూ.15,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న OPPO A58 4G

Highlights

  • ఆగస్టు 8 న భారత్ లో లాంచ్ కానున్న OPPO A58 4G
  • రూ.14,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 5000mAh బ్యాటరీ, 33w చార్జింగ్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO A58 4G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా భారత వేరియంట్ యొక్క లాంచ్ తేదీ, ధర, ఇతక ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO A58 4G లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

OPPO A58 4G యొక్క ట్రెయినింగ్ మెటీరియల్, లాంచ్ తేదీ, ధర వివరాలను The Tech Outlook వెబ్ సైట్ షేర్ చేసింది.

  • నివేదిక ప్రకారం, ఆగస్టు 8 న అంటే రేపు OPPO A58 4G డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
  • లాంచ్ తర్వాత OPPO A58 4G సేల్ ఆగస్టు 10 న మొదలు కానుందని సమాచారం.
  • భారత్ లో OPPO A58 4G రూ.14,999 ధరతో లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది.
  • ఇది 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అని గమనించాలి.

OPPO A58 4G ట్రెయినింగ్ మెటీరియల్ వివరాలు (లీక్)

  • ట్రెయినింగ్ మెటీరియల్ ఇమేజెస్ ని బట్టి, డివైజ్ 2.8డి కర్వ్డ్ బాడీ, గ్లోయింగ్ స్కిన్ డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • OPPO A58 4G డివైజ్ డాజ్లింగ్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • OPPO A58 4G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
  • OPPO A58 4G లో డ్యూయల్ స్పీకర్స్, 4జీ కనెక్టివిటీ ఉంటాయి.
  • OPPO A58 4G డిస్ప్లే పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ని కలిగి ఉంటుంది. డ్యూయల్ సర్క్యులర్ కటౌట్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తోంది.

OPPO A58 4G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: OPPO A58 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. మాలి జీ52 జీపీయూ గ్రాఫిక్స్ కోసం వినియోగించారు.
  • స్టోరేజీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 6జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.