OPPO A3x: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన ఒప్పో ఏ3ఎక్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో OPPO A3x లాంచ్
  • మోడల్ నంబర్ CPH2641
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3x పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. OPPO A3x స్మార్ట్‌ఫోన్ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OPPO A3x ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

OPPO A3x స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్‌కి చెందిన సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్ ఎన్బీటీసీపై లిస్ట్ అయ్యింది.

OPPO A3x డివైజ్ ఎన్బీటీసీ సైట్ లో CPH2641 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

ఒప్పో నుంచి రాబోవు OPPO A3x డివైజ్ జీఎస్ఎమ్, డబ్ల్యూసీడీఎంఏ, ఎల్టీఈ కనెక్టివిటీతో ఎన్బీటీసీపై కనిపించింది.

మరోవైపు, OPPO A3x డివైజ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు తెలిసాయి.

OPPO A3x స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది.

ఇక బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్, గీక్‌బెంచ్ పై OPPO A3x డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 344 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,181 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ డివైజ్ 2.02 గిగాహెర్ట్జ్ బేస్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. మదర్‌బోర్డ్ బెంగాల్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ అడ్రెనో 610 జీపీయూ గ్రాఫిక్స్ అందించనున్నారు.

డేటాబేస్ లో లిస్టైన వివరాల ప్రకారం, OPPO A3x డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో రానుందని అర్థమవుతోంది.

OPPO A3x స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ రివీల్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. దీంతో పాటు ఒప్పో కంపెనీ, 5జీ వేరియంట్ OPPO A3m 5G ని కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు TENAA సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది.