OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ

Highlights

  • త్వరలో OPPO A3 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ PKA110
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A3 Pro 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు ఒప్పో సంస్థ స్టాండర్డ్ వేరియంట్ OPPO A3 5G ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 5G చైనా టెలీకామ్ లిస్టింగ్ వివరాలు

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై PKA110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆక్టా-కోర్ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

OPPO A3 5G డివైజ్ చైనా టెలీకామ్ లిస్టింగ్ పై 6.7-ఇంచ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కనిపించింది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ 162.54 మి.మీ పొడవు, 75.44 మి.మీ వెడల్పు, 7.15 మి.మీ మందం, 179.05 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది. త్వరలోనే ఈ డివైజ్ యొక్క లాంచ్ వివరాలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోట్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OPPO A3 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.