OPPO A3: IP65 రేటింగ్‌తో చైనాలో లాంచైన ఒప్పో ఏ3

Highlights

  • చైనాలో OPPO A3 లాంచ్
  • జులై 5 నుంచి సేల్
  • స్నాప్‌డ్రాగన్ 695 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి తాజాగా ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. OPPO A3 పేరుతో ఈ ఫోన్‌ని తన హోమ్ మార్కెట్ చైనాలో ఒప్పో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని మిడ్-రేంజ్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. చైనాలో జులై 5వ తేదీ నుంచి ఒప్పో ఏ3 ఫోన్ యొక్క సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్, 12జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓసారి ఒప్పో ఏ3 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 ధర, సేల్

OPPO A3 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1599 యువాన్లు (సుమారు రూ.18,365) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,660) గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 2099 యువాన్లు (సుమారు రూ.24,110) గా ఉంది.

OPPO A3 స్మార్ట్‌ఫోన్ ట్రాన్‌క్విలిటీ బ్లాక్, అరోరా పర్పుల్ మరియు మౌంటెయిన్ స్ట్రీమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

OPPO A3 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: OPPO A3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO A3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO A3 లో స్పీకర్, ఐపీ65 రేటింగ్, యూఎస్బీ టైప్-సీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.