OPPO: ఏప్రిల్ 19న చైనాలో లాంచ్ అవుతోన్న OPPO A1i

Highlights

  • త్వరలో OPPO A1i లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 12జిబి వర్చువల్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A1i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత వారం ఏ-సిరీస్ లోనే A3 Pro అనే ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO A1i లాంచ్ కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఒప్పో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A1i లాంచ్ వివరాలు

OPPO A1i స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 19వ తేదీన లాంచ్ అవుతోంది. ఒప్పో వెబ్‌సైట్ పై ప్రస్తుతం ఈ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో డివైజ్ యొక్క లుక్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO A1i యొక్క లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం, ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున ఫోన్ యొక్క ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ కానున్నాయి.

OPPO A1i స్పెసిఫికేషన్స్

  • ర్యామ్, స్టోరేజీ: OPPO A1i స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్. ఈ రెండు వేరియంట్లు కూడా 256జిబి స్టోరేజీతో వస్తున్నాయి. OPPO A1i లో 12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OPPO A1i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
  • కలర్ ఆప్షన్స్: OPPO A1i స్మార్ట్‌ఫోన్ పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఇతర వేరియంట్స్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్‌ని అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: OPPO A3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.