OnePlus Nord CE 4 Lite 5G: 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో భారత్‌లో లాంచైన నార్డ్ సీఈ 4 లైట్ 5జీ

Highlights

  • భారత్‌లో OnePlus Nord CE 4 Lite 5G లాంచ్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో కొత్త నార్డ్ ఫోన్ లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE 4 Lite 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర, లభ్యత

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.22,999 గా పెట్టారు.

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 480 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్వా టచ్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord CE 4 Lite 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.