OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ

Highlights

  • జూన్ 24న Nord CE 4 Lite 5G విడుదల
  • రివీలైన ఇమేజ్, కెమెరా వివరాలు
  • 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జూన్ 24వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ ఇమేజ్ తో పాటు, కెమెరా వివరాలను కంపెనీ రివీల్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర (లీక్)

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు ధరతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.22,999 ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. 1టిబి మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.