OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో OnePlus Nord 4 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1875 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4934 పాయింట్లు స్కోర్ చేసింది.

పైనాపిల్ అనే కోడ్ పేరుతో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్సెట్ మరియు అడ్రెనో 732 జీపీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

కోడ్ నేమ్ మరియు జీపీయూ ప్రకారం, ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 4 డివైజ్ 12జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

OnePlus Nord 4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Nord 4 యూరోఫిన్స్ లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

OnePlus Nord 4 డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord 4 కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ Camera FV 5 సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ ఓఐఎస్, f/1.9 అపర్చర్, 26.4ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

OnePlus Nord 4 డివైజ్ f/2.4 అపర్చర్, ఈఐఎస్, 25.2 ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

చైనాలో లాంచైన OnePlus Ace 3V కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord 4 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా OnePlus Nord 4 లాంచ్ కానుంది. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.