OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి!

Highlights

  • నేటి నుంచి OnePlus 12R సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఇటీవలె OnePlus 12R డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో OnePlus 12R సేల్ మొదలైంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా OnePlus 12R ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై కంపెనీ OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి OnePlus 12R ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర మరియు ఆఫర్లు

  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో విక్రయానికి వచ్చింది. అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • OnePlus 12R 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
  • OnePlus 12R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.45,999 గా ఉంది.
  • OnePlus 12R తో పాటు రూ.4,999 విలువగల OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 6 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ మరియు వన్‌కార్డ్ లావాదేవీలపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
  • OnePlus 12R ఈఎఐ ఆఫర్ల విషయానికి వస్తే, 6 నెలల కాలపరిమితితో ఈఎంఐ సౌకర్యం ఉంది.
  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ని నో కాస్ట్ ఈఎంఐ పై పొందాలనుకుంటే, మీరు నెలకు రూ.2,927 ఇన్‌స్టాల్మెంట్ కడితే సరిపోతుంది.

OnePlus 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12R లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12R లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.