Nothing: లీకైన Nothing Phone (2a) రెండర్ ఇమేజ్, ఎన్బీటీసీ పై లిస్టైన డివైజ్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • తాజాగా లీకైన ఫోన్ రెండర్
  • ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ డివైజ్ లాంచ్ కోసం నథింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో Nothing Phone (2a) లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే తాజాగా Nothing Phone (2a) లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) రెండర్ ఇమేజ్ (లీక్)

  • Nothing Phone (2a) రెండర్ ఇమేజ్ Smartprix మరియు Onleaks ద్వారా లీక్ అయ్యింది.
  • Nothing Phone (2a) లో బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ కెమెరా లెన్సెస్ ఉన్నాయి.
  • Nothing Phone (2a) బ్యాక్ ప్యానెల్ పై ఎడమవైపున నథింగ్ బ్రాండింగ్ మరియు సీఈ సర్టిఫికేషన్ వివరాలు కుడివైపున ఉన్నాయి.
  • Nothing Phone (2a) లో గమనించదగిన విషయం ఏంటంటే, గతంలో వచ్చిన ఫోన్లలో ఉన్నటువంటి గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ ఈ ఫోన్లో లేదు. ఇది వేరే తరహాలో ఉంది.
  • మరి లాంచ్ సమయంలో ఏ విధమైన ఫోన్ విడుదలవుతుందో చూడాలి.

Nothing Phone (2a) NBTC లిస్టింగ్

  • Nothing Phone (2a) డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Nothing Phone (2a) డివైజ్ A142 అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Nothing Phone (2a) ఫోన్ 2జీ, 3జీ, 4జీ, 5జీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Nothing Phone (2a) కి సంబంధించిన ఇతర వివరాలు ఎన్బీటీసీ ద్వారా రివీల్ కాలేదు.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1084*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) లో 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Nothing Phone (2a) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.