లాంచ్ అయిన Nokia X30 5G, Nokia G60 5G, Nokia C31, Nokia T21: ధరలు, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

  • స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, బ్లూటూత్ స్పీకర్స్ ని ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో లాంచ్ చేసిన నోకియా
  • నోకియా ఎక్స్30 5జీ, నోకియా జీ60 5జీ, నోకియా సీ31, నోకియా టీ1 లను లాంచ్ చేసిన నోకియా
  • భారత్ లో డివైజెస్ లభ్యతపై ఇంకా రాని క్లారిటీ

నోకియా బ్రాండ్ హక్కుదారు HMD Global, గురువారం నాడు జరిగిన ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో పలు నోకియా డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈవెంట్లో నోకియా టీ21 టాబ్లెట్, నోకియా పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ 2, క్లారిటీ ఇయర్‌బడ్స్ 2 ప్రో, మూడు స్మార్ట్ ఫోన్స్: నోకియా ఎక్స్30 5జీ, నోకియా జీ60 5జీ, నోకియా సీ31 లను లాంచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన మార్కెట్లలో ఈ డివైజ్ లను నోకియా లాంచ్ చేసింది. ఈ డివైజెస్ ని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా లో లాంచ్ చేస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. మరి ఈ డివైజెస్ యొక్క ఫీచర్లేంటో తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G: ధర, ఫీచర్లు

నోకియా ఎక్స్30 5జీ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్ సపోర్ట్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా: 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా, మూడేళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని నోకియా ప్రామిస్ చేస్తోంది.

ఈ ఫోన్ క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర 529 యూరోలు (దాదాపు రూ.42,200)

Nokia G60 5G: ధర, ఫీచర్లు

నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4జిబి/64జిబి, 4జిబి/128జిబి, 6జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక నోకియా నుంచి 3 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి.

ప్యూర్ బ్లాక్, ఐస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర 319 యూరోలు (రూ.25,500)

Nokia C31: ధర, ఫీచర్లు

నోకియా సీ31 లో 6.7 అంగుళాల 2.5డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి/128జిబి స్టోరేజీ, 256జిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్), 5050ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, యూనిసాక్ 9863ఏ1 చిప్, 13ఎంపి+2ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో ఉన్నాయి.

మింట్, చార్కోల్, సైఆన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. కాగా, ఈ ఫోన్ ధర 239 యూరోలు (దాదాపు రూ.19,000)

Nokia T21 టాబ్లెట్: ధర, ఫీచర్లు

నోకియా టీ21 టాబ్లెట్ లో 10.4 అంగుళాల 2కే డిస్ప్లే, 360 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ టీ612 చిప్, 8200ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ చార్జింగ్, 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 512 ఎక్స్‌పాండబుల్ మెమొరీ (వయా ఎస్డీ కార్డ్), 8ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్ లో ఈ ట్యాబ్లెట్ లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్ ధర 129 యూరోలు (దాదాపు రూ.10,300)