HMD Lumia: కొత్త అవతారంలో వస్తోన్న Nokia Lumia

Highlights

  • త్వరలో HMD Lumia లాంచ్
  • తాజాగా లీకైన ఫోన్ వివరాలు
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

నోకియా పేరెంట్ కంపెనీ HMD నుంచి త్వరలో Lumia సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో ఏయే ఫోన్లు రానున్నాయో ఇంకా తెలియదు. అయితే ఒక ఫోన్ మాత్రం HMD Lumia పేరుతో లాంచ్ అవుతుందని తాజాగా ఓ సమాచారం లీక్ అయ్యింది. గతంలో వచ్చిన Nokia Lumia మాదిరి ఈ ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్తతరం లూమియా ఫోన్ తీరుతెన్నులు, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

HMD Lumia స్పెసిఫికేషన్స్ (లీక్)

డిజైన్: లీక్ ప్రకారం, HMD Lumia డివైజ్ ఫాబులా డిజైన్ తో వస్తోంది. ఇది పాతతరం లూమియా ఫోన్ మాదిరి ఉంటుంది. అంటే ఒరిజినల్ నోకియా లూమియా ఫోన్ లాగా ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

డిస్ప్లే: HMD Lumia లో పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: HMD Lumia లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

కెమెరా: HMD Lumia లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: HMD Lumia లో పవర్ బ్యాకప్ కోసం 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: HMD Lumia లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ సిమ్, 5జీ, ప్యూర్ వ్యూ అండ్ ఓజో ఆడియో ఉంటాయి.