60 ఏళ్ళలో తొలిసారిగా మారిన Nokia లోగో

Highlights

  • తన 60 ఏళ్ళ ప్రస్థానంలో తొలిసారిగా లోగోని మార్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia
  • 5 విభిన్న ఆకారాలతో రూపొందిన Nokia యొక్క కొత్త లోగో
  • అవసరానుగుణంగా ఇతర రంగుల్లోకి మారిన ఐకానిక్ బ్లూ కలర్

Nokia.. 60 ఏళ్ళ తన ప్రస్థానంలో తొలిసారిగా తన బ్రాండ్ లోగోని మార్చింది. ఈసారి పాత లోగో స్థానంలో పూర్తిగా కొత్త లోగోని తీసుకొచ్చింది. కొత్త లోగో లో 5 విభిన్న ఆకారాలు కలగలిసి Nokia అనే పదానికి రూపం ఇచ్చాయి. ఐకానిక్ బ్లూ కలర్ స్థానంలో వివిధ రంగులు ప్రవేశించాయి.

Reuters తో జరిగిన ఇంటర్వ్యూలో నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లుండ్‌మార్క్ మాట్లాడుతూ, “ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ తో అసోసియేషన్ ఉండేది. ఈరోజుల్లో మేం బిజినెస్ టెక్నాలజీగా మారం.” అని అన్నారు. 2020 లో ఫిన్నిష్ కంపెనీ నోకియా సీఈవో గా బాధ్యతలు తీసుకున్నాక, లుండ్‌మార్క్ తన స్ట్రేటజీని అమలు చేస్తూ వస్తున్నారు. రిసెట్, యాక్సలరేట్, స్కేల్ అనే ఫార్ములాతో ఆయన ముందుకు వెళ్తున్నారు.

కంపెనీ ప్రకారం, రిసెట్ దశ ప్రస్తుతం ముగిసింది. ప్రస్తుతం రెండవ దశ ప్రారంభమైందని లుండ్‌మార్క్ చెప్పారు. Nokia సంస్థ తన సర్వీస్ ప్రొవైడర్ బిజినెస్ ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. టెలీకామ్ కంపెనీలకు నోకియా సాంకేతికతను, ఎక్విప్మెంట్ ని అమ్ముతుంది. ఇది నోకియా యొక్క ప్రధాన బిజినెస్.

మారిన Nokia లోగో

టెక్నాలజీ సంస్థలు టెలీకామ్ ఎక్విప్మెంట్ అమ్మే నోకియా వంటి సంస్థలతో జట్టుకట్టి ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్, ఇతర సామగ్రిని ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలకు అమ్ముతున్నాయి. ప్రస్తుతం నోకియా సంస్థ తనకు చెందిన వివిధ వ్యాపారాల వృద్ధి సరళిని సమీక్షించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై తన దృష్టిని నిలిపింది.

“మమ్మల్ని అగ్రస్థానంలో నిలిపే బిజినెసెస్ లోనే ఉండాలని మేం భావిస్తున్నాం. అందుకు ప్రస్తుత పరిణామమే ఒక కచ్చితమైన సూచన.” అని లుండ్‌మార్క్ అన్నారు. ఆటోమేషన్ మరియు డేటా సెంటర్స్ వ్యాపారాల్లో మైక్రోసాఫ్ట్ మరియు అమెజాన్ లకు గట్టి పోటీ ఇవ్వాలని Nokia భావిస్తోంది.

తక్కువ మార్జిన్స్ ఉన్న భారతీయ మార్కెట్ తమకు వేగంగా వృద్ధి చెందే చోటు అని, ఇదొక నిర్మాణాత్మక మార్పు అని లుండ్‌మార్క్ అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉత్తర అమెరికా బలంగా తయారయ్యే అవకాశం ఉందని Nokia భావిస్తోంది.

ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే, తాజాగా Nokia సంస్థ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న MWC 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది. ఇది కూడా చదవండి: MWC 2023: 90Hz డిస్ప్లే, 50MP కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.