OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం

హైలైట్స్

  • ఒప్పో ని కోర్టుకి లాగనున్న నోకియా, ఆస్ట్రేలియాలో కేసు నమోదు
  • గడువు ముగిసినా రెనివల్ చేయకుండా తమ టెక్నాలజీని వినియోగించుకుంటోందని నోకియా ఆరోపణలు
  • అనుమతి లేకుండా నోకియా యొక్క 4జీ, 5జీ టెక్నాలజీని ఒప్పో వాడుకుంటోందని నోకియా వాదన

పోటీలో ముందుండాలనే తపన ప్రతి రంగంలో ఉంటుంది. టెక్నాలజీ మార్కెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ తమ యూజర్ బేస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ పోరులో, కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి. ఇటువంటి స్కాండల్ లోనే చైనా కంపెనీ ఒప్పో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ బ్రాండ్ నోకియా, ఒప్పో ఆస్ట్రేలియా పై కేసు పెట్టింది. దీని కంటే ముందు నోకియా కంపెనీ వన్‌ప్లస్, ఒప్పో లను జర్మనీ లో ఓ కేసులో ఓడించింది. దీని తర్వాత ఆ దేశంలో ఒప్పో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిలిచిపోయాయి.

OPPO పై కేసు పెట్టనున్న Nokia

నోకియా కంపెనీ, చైనీస్ బ్రాండ్ ఒప్పో పై కేసు ఫైల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసే ఆస్ట్రేలియాలో నమోదు కానుంది. ఈ కేసు నోకియా యొక్క సర్వీస్ ఎనేబుల్మెంట్ ప్లాట్ఫమ్ అతిక్రమణకు సంబంధించినది. నోకియా 4జీ మరియు 5జీ టెక్నాలజీలను కంపెనీ అనుమతి లేకుండా ఒప్పో సంస్థ వినియోగిస్తోందని సదరు కంపెనీ ఆరోపిస్తోంది. ఒప్పో ప్రస్తుతం నోకియా యొక్క టెక్నాలజీని తన స్మార్ట్ ఫోన్లలో వాడుతోంది. అయితే అనుమతి లేకుండా వాడుతోంది.

OPPO పై Nokia ఎందుకు కేసు పెట్టింది?

2018 లో వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫిన్‌ల్యాండ్ కి చెందిన నోకియా మరియు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కి మధ్య ఒక లైసెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, నోకియా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఒప్పో తన ప్రోడక్ట్స్ లో వాడుకునే అవకాశం ఉంది. అయితే ఆ లైసెన్స్ గడువు 2021 తో ముగిసింది. కానీ, ఒప్పందాన్ని రిన్యూ చేసుకోకుండా ఒప్పో సంస్థ నోకియా టెక్నాలజీని వాడుకుంటోంది. దీంతో నోకియా కంపెనీ ఒప్పో పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జర్మనీలో బ్యాన్ అయిన OPPO స్మార్ట్ ఫోన్లు

ఆస్ట్రేలియా కంటే ముందు, నోకియా కంపెనీ ఒప్పో, వన్‌ప్లస్ పైన జర్మనీ లో కేసు పెట్టింది. అప్పుడు కోర్టు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలది తప్పని తేల్చడంతో, నోకియా ఆ కేసులో గెలిచింది. దాంతో జర్మనీలో ఒప్పో మరియు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు రద్దయ్యాయి. ఈ బ్యాన్ తో ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలకు పెద్ద దెబ్బ తగిలినట్లైంది. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో కూడా ఒప్పో మొబైల్ ఫోన్లు బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఒప్పో, నోకియా సంస్థలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.