Nokia 220 4G, Nokia 235 4G: యూపీఐ సపోర్ట్‌తో లాంచైన నోకియా ఫీచర్ ఫోన్లు

Highlights

  • భారత్‌లో లాంచైన రెండు నోకియా ఫోన్లు
  • డివైజెస్ ధర రూ.3,500 లోపే
  • కలర్స్: బ్లూ, బ్లాక్, పర్పుల్

Nokia లైసెన్స్ హోల్డర్ HMD బ్రాండ్ భారతీయ మార్కెట్ లో వరుసగా నోకియా బ్రాండ్ పేరుతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ నుంచి Nokia 220 4G, Nokia 235 4G అనే రెండు కీప్యాడ్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లలో యూపీఐ పేమెంట్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Nokia 220 4G, Nokia 235 4G ధర

నోకియా 235 4జీ ఫోన్ ధరను భారత్ లో రూ.3,749 గా నిర్ణయించారు. మరోవైపు Nokia 220 4G రూ.3,249 గా పెట్టారు. ఈ రెండు ఫోన్లను హెఎండి.కామ్ మరియు అమెజాన్.ఇన్ వెబ్‌సైట్స్ తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. నోకియా 235 4జీ ఫోన్‌ బ్లూ, బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో
లభిస్తుంది. నోకియా 220 4జీ ఫోన్ పీచ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia 220 4G, Nokia 235 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: నోకియా 220 4జీ మరియు నోకియా 235 4జీ ఫోన్లలో 2.8-ఇంచ్ స్క్రీన్, క్యూవీజీఏ ఐపీఎస్ ప్యానెల్ ఉన్నాయి.

కెమెరా: నోకియా 235 4జీ కీప్యాడ్ ఫోన్ లో 2ఎంపి రియర్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంది. మరోవైపు నోకియా 220 4జీ కీప్యాడ్ ఫోన్లో కెమెరా లేదు. అయితే ఇందులో టార్చ్ లైట్ ఇచ్చారు.

బ్యాటరీ: ఈ ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 9.8 గంటల టాక్‌టైమ్‌ని ఈ బ్యాటరీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటీ: ఈ నోకియా ఫీచర్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: ఈ నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, యూపీఐ యాప్ సపోర్ట్ ఉన్నాయి.

గేమ్స్, సోషల్ మీడియా: ఈ నోకియా ఫోన్లలో బాగా ప్రాచుర్యం పొందిన స్నేక్ గేమ్ ని అందించారు. అంతేకాదు, ఈ ఫోన్లు యూట్యూబ్ కి కూడా సపోర్ట్ చేస్తాయి.