Moto Razr 50 Ultra: జులై 4న భారత్‌లో లాంచ్ కానున్న రేజర్ 50 అల్ట్రా

Highlights

  • జులై 4న Moto Razr 50 Ultra లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • పీఓఎల్ఈడీ ఎల్టీపీవో 165 హెర్ట్జ్ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 4వ తేదీన మోటో రేజర్ 50 అల్ట్రా డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఓసారి Moto Razr 50 Ultra ఇండియా లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto Razr 50 Ultra లాంచ్ వివరాలు

Moto Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ల్యాండింగ్ పేజీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై దర్శనమిస్తోంది. జులై 4న భారత్ లో డివైజ్ విడుదలవుతోంది. స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ మరియు మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto Razr 50 Ultra స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Motorola Razr 50 Ultra లో 6.9-ఇంచ్ ఫ్లెక్స్ వ్యూ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 4-ఇంచ్ (1272*1080 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

కెమెరా: Motorola Razr 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Razr 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 Ultra లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీఎక్స్8 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.