Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra

Highlights

  • చైనాలో Motorola Razr 50 సిరీస్ లాంచ్
  • ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Motorola Razr 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఫోన్లలో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Motorola Razr 50, Motorola Razr 50 Ultra ధరలు

Motorola Razr 50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3699 యువాన్లు (సుమారు రూ.42,500) గా నిర్ణయించారు.

Motorola Razr 50 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.45,945) గా పెట్టారు.

Motorola Razr 50 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.65,470) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.71,220) గా నిర్ణియంచారు.

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ మూన్ వెల్వెట్ బ్లాక్, ఎలిఫెంట్ గ్రే మరియు ప్యాషన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 Ultra డివైజ్ వింటేజ్ డెనిమ్, మోడర్న్ గ్రీన్ మరియు సాఫ్ట్ పీచ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, 3.6-ఇంచ్ (1066*1056 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఔటర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 లో స్టీరియో స్పీకర్స్, ఐపీఎక్స్8 రేటింగ్, డాల్బీ అట్మాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Motorola Razr 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 Ultra లో 6.9-ఇంచ్ ఫ్లెక్స్ వ్యూ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 4-ఇంచ్ (1272*1080 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

కెమెరా: Motorola Razr 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Razr 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 Ultra లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీఎక్స్8 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.