Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ ఖరారు

Highlights

  • Moto Edge 50 Ultra లాంచ్ ఖరారు
  • టీజర్ విడుదల చేసిన మోటోరోలా
  • త్వరలో లాంచ్ తేదీ ప్రకటన

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీజర్‌ను కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. కాగా, ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Motorola Edge 50 Ultra యొక్క ఇండియా లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్

Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు మోటోరోలా ఇండియా అఫీషియల్ గా ప్రకటించింది. టీజర్ ఇమేజ్ ను గమనిస్తే, అందులో Motorola Edge 50 Ultra కనిపిస్తోంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జూన్ ఆఖర్లో ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్సెట్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్. ఇండియన్ వేరియంట్ లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మెమొరీ: Motorola Edge 50 Ultra డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. భారత్ లో కూడా ఇదే ర్యామ్ వేరియంట్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

కెమెరా: Motorola Edge 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో ఒమ్నివిజన్ ఒవి64బి లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ టర్బోపవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో ఐపీ68 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, 3 మైక్రోఫోన్స్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

Motorola Edge 50 Ultra భారత మార్కెట్ ధర (అంచనా)

Motorola Edge 50 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.50,000 పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. Motorola Edge 50 Ultra 12జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.42,000 గా ఉండవచ్చు.