Motorola: త్వరలో లాంచ్ కానున్న Edge 50 Fusion, తాజాగా లీకైన టీజర్

Highlights

  • లీకైన Motorola Edge 50 Fusion టీజర్ వీడియో
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో Edge 50 Fusion అనే డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియో లీక్ అయ్యింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, ఇతర వివరాలు బయటకు వచ్చాయి. ఎడ్జ్ 50 సిరీస్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 ప్రో డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు Motorola Edge 50 Fusion లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓసారి ఎడ్జ్ 50 ఫ్యూజన్ టీజర్ వీడియో విశేషాలను తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Fusion టీజర్ (లీక్)

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ టీజర్‌ని ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టీజర్ వీడియోని గమనిస్తే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో రెయిజ్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ లో రెండు సర్క్యులర్ కెమెరా రింగ్స్ ఉన్నాయి. మాడ్యూల్ చూడటానికి గ్లాస్ ఫినిష్ తో ఉన్నట్లనిపిస్తోంది.

కెమెరా వివరాల్లోకి వెళ్తే, ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

టీజర్ వీడియోలో ఫోన్ బాలడ్ బ్లూ, పీకాక్ పింక్ మరియు టైడల్ టీ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.

వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఫోన్ కూడా నీటిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే ఇది ఐపీ68 రేటింగ్ తో వస్తున్నట్లు తెలియజేస్తోంది.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

Motorola Edge 50 Fusion ధర (అంచనా)

Motorola Edge 50 Fusion డివైజ్ భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో రూ.25,000 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధరకు సంబంధించి మోటోరోలా బ్రాండ్ నుంచి కూడా టీజర్ వచ్చే అవకాశం ఉంది.