Moto G85: త్వరలో భారత్‌లో మోటో జీ85 లాంచ్, రివీలైన టీజర్

Highlights

  • త్వరలో Moto G85 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G85 ని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ S50 Neo పేరుతో చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌పై మోటో జీ85 టీజర్ ప్రత్యక్షమైంది. అయితే తర్వాత కాసేపటికి లిస్టింగ్‌ను తీసేశారు. దీనికి కారణం తెలియదు. లిస్టింగ్ యూఆర్ఎల్ ద్వారా లాంచ్ కన్ఫర్మ్ అవుతోంది.

Moto G85 ఇండియా లాంచ్ టీజర్ (అంచనా)

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపించిన లిస్టింగ్ ప్రకారం, కొత్త మోటోరోలా డివైజ్ జులై 3వ తేదీన లాంచ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన ఇమేజ్ క్రింద చూడవచ్చు. అయితే ఇమేజ్ లో ఫోన్ పేరును పేర్కొనలేదు. కానీ, గత కొన్ని రోజులుగా Moto G85 కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు.

Moto G85 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

స్క్రీన్: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Moto G85 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Moto G85 5G డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Moto G85 5G లో 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 4 ఏళ్ళ దాకా ఓఎస్ అప్డేట్స్ పొందుతుంది.