Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto G24 Power
  • 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • Moto G24 Power ప్రారంభ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G24 Power డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 30 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto G24 Power స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G24 Power ధర

  • Moto G24 Power డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
  • Moto G24 Power 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది.
  • Moto G24 Power 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
  • Moto G24 Power స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ బ్లూ మరియు ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto G24 Power కొనుగోలుపై రూ.750 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.
  • Moto G24 Power డివైజ్ ని ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి మోటోరోలా, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto G24 Power స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. మాలి-జీ52 గ్రాఫిక్స్ ని ఈ ఫోన్ లో అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు స్టోరేజీ పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Moto G24 Power డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G24 Power లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Moto G24 Power లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ టర్బో చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G24 Power లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎఫ్ఎమ్ రేడియో, వాటర్-రిపెలెంట్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.