Moto G04s ధరను ప్రకటించిన Motorola

Highlights

  • ఇటీవలె గ్లోబల్‌గా Moto G04s లాంచ్
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ
  • Moto G04s ధర 119 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola కొత్త జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ Moto G04s ని ఇటీవలె లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఈ ఫోన్ ధరను నేడు కంపెనీ ప్రకటించింది. రూ.10,000 ధర శ్రేణిలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4జిబి వర్చువల్ ర్యామ్, యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G04s ధర, కలర్ ఆప్షన్స్

Moto G04s స్మార్ట్‌ఫోన్ జర్మనీలో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను 119 యూరోలుగా నిర్ణయించారు. దీన్ని భారతీయ కరెన్సీలోకి మార్చితే దాదాపు రూ.10,650 అవుతుంది. జర్మనీలో ఈ ఫోన్ కాన్‌కార్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది.

Moto G04s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04s లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చిప్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6Ghz.
  • మెమొరీ: Moto G04s డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Moto G04s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G04s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్పీకర్, వాటర్-రిపెల్లెంట్ డిజైన్ ఉన్నాయి.