Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24

Highlights

  • యూరప్ లో లాంచైన Moto G04, Moto G24
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన మోటో జీ24
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్‌తో వచ్చిన మోటో జీ04

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా జీ-సిరీస్ లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Moto G04, Moto G24 డివైజెస్ యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్లను బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ కొరకు చూసే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఇకపోతే, ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G04, Moto G24 ధర, లభ్యత

  • Moto G04, Moto G24 డివైజెస్ ధరలు వరుసగా 119 యూరోలు (సుమారు రూ.10,775) మరియు 129 యూరోలు (సుమారు రూ.11,680) గా ఉన్నాయి.
  • ప్రస్తుతం ఈ డివైజెస్ యూరప్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.
  • భారత మార్కెట్ లో ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Moto G24 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 లో 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు ర్యామ్ బూస్ట్ ఫీచర్ ఉన్నాయి. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Moto G24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, ఛార్జింగ్: Moto G24 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ టర్బోపవర్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Moto G24 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Moto G04 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ మోడ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 లో 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ బూస్ట్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Moto G04 లో 16ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G04 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Moto G04 డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.