Motorola: ఏప్రిల్ 3న లాంచ్ అవుతోన్న Moto Edge 50 Fusion, లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights

  • ఏప్రిల్ 3న Moto Edge 50 Fusion లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 3న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Moto Edge 50 Fusion అనే మరొక ఫోన్ కూడా లాంచ్ అవ్వనుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Edge 50 Fusion రెండర్స్ మరియు ధర

Moto Edge 50 Fusion యొక్క రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ తేదీని Android Headlines లీక్ చేసింది.

డిజైన్ గురించి మాట్లాడితే, Moto Edge 50 Fusion కర్వ్డ్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. ఇందులో రెండు భారీ కటౌట్ ఉన్నాయి. ముందువైపు కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉంది.

Moto Edge 50 Fusion లో ముందువైపు పంచ్-హోల్ డిస్ప్లే ఉంది.

Moto Edge 50 Fusion డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. బాలడ్ బ్లూ, పీకాక్ పింక్ మరియు టైడల్ టీల్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది.

అన్ని కలర్ ఆప్షన్స్ లో బ్యాక్ ప్యానెల్ టెక్షర్డ్ ఫినిష్ తో ఉంది. బాలడ్ బ్లూ కలర్ ఆప్షన్ మాత్రం వీగన్ లెదర్ ఫినిష్ ని కలిగి ఉంది.

Moto Edge 50 Fusion డివైజ్ ధర 300 యూఎస్ డాలర్లు (సుమారు రూ.25,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Moto Edge 50 Fusion స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Moto Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 50 Fusion లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Moto Edge 50 Fusion లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 50 Fusion లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 50 Fusion లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటుంది.