LAVA: అమెజాన్‌పై కనిపించిన Lava Yuva 3 మైక్రో-సైట్, త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్న Lava Yuva 3
  • యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ని ఆఫర్ చేయనున్న ఫోన్
  • అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Yuva 3

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Lava Yuva 3 మైక్రో-సైట్ ప్రత్యక్షమైంది. దీంతో Lava Yuva 3 లాంచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే, అమెజాన్ ద్వారా Lava Yuva 3 సేల్ కి రానుందని స్పష్టమైంది. Lava Yuva 3 అమెజాన్ టీజర్ ద్వారా హ్యాండ్సెట్ 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో రానుందని తెలుస్తోంది. ఈఎంఎంసీ స్టోరేజీతో పోల్చితే యూఎఫ్ఎస్ 2.2 మూడు రెట్లు వేగవంతమైంది. సరే, ఓసారి Lava Yuva 3 టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 అమెజాన్ టీజర్

  • ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై Lava Yuva 3 టీజర్ ప్రత్యక్షమైంది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి.

  • Lava Yuva 3 డివైజ్ 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్ 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో రానుందని టీజర్ లో పేర్కొనబడి ఉంది. అలాగే 512జిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకునే సౌకర్యం ఈ ఫోన్ లో ఉంది.
  • Lava Yuva 3 డివైజ్ 64జిబి మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని సమాచారం.
  • అమెజాన్ టీజర్ ద్వారా Lava Yuva 3 కి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కాలేదు.
  • గత మోడల్ Lava Yuva 2 కి సక్సెసర్ గా Lava Yuva 3 మార్కెట్ లోకి ప్రవేశించనుంది.
  • Lava Yuva 3 Pro కంటే Lava Yuva 3 ధర తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.