Lava: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava O2

Highlights

  • భారత్ లో Lava O2 లాంచ్
  • UniSoc T616 చిప్సెట్
  • మార్చి 27 నుంచి సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava O2 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది. యూనిఎస్ఓసీ టీ616 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ప్రీమియమ్ ఏజీ గ్లాస్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Lava O2 ధర, స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Lava O2 ధర, లభ్యత

Lava O2 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.5,00 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో Lava O2 రూ.7,999 కే లభించనుంది. మార్చి 27 నుంచి అమెజాన్ ద్వారా Lava O2 సేల్ కి అందుబాటులో ఉంటుంది. లావా ఈ-స్టోర్ ద్వారా కూడా Lava O2 ని కొనుగోలు చేయవచ్చు.

Lava సంస్థ ఉచిత హోమ్ సర్వీస్ ని కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌ని వ్యారంటీ పీరియడ్ లో ఇంటి వద్దే ఏదైనా రిపేరు చేయించుకునే వీలుంటుంది. Lava O2 ఫోన్ ఇంపీరియల్ గ్రీన్, మెజెస్టిక్ పర్పుల్ మరియు రాయల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava O2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: Lava O2 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava O2 లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava O2 డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • సాఫ్ట్‌వేర్: Lava O2 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కి అప్‌గ్రేడ్ అవుతుంది. అలాగే 2 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • కెమెరా: Lava O2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Lava O2 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Lava O2 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • భద్రత: Lava O2 లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • బరువు, చుట్టుకొలత: Lava O2 డివైజ్ 165.0 మి.మీ పొడవు, 76.1 మి.మీ వెడల్పు, 8.7 మి.మీ మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది.