Lava Blaze X టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్

Highlights

  • Lava Blaze X లాంచ్ ఖరారు
  • తాజాగా టీజర్ విడుదల
  • అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో బ్లేజ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ తో పాటు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై Lava Blaze X యొక్క టీజర్ షేర్ చేసింది. దీంతో లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Lava Blaze X ఇండియా లాంచ్ ఖరారు

సోషల్ మీడియా వేదిక X మరియు అమెజాన్ వెబ్‌సైట్ పై Lava Blaze X యొక్క టీజర్ విడుదలైంది. టీజర్ లో కమింగ్ సూన్ అని ఉంది. వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేయడమైంది.

అమెజాన్ మైక్రో-సైట్ గమనిస్తే, ఇందులో లావా ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. అలాగే ఫోన్ పై భాగాన సెకండరీ మైక్రోఫోన్ కనిపిస్తోంది.

Lava Blaze X డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇప్పటి వరకు లావా కొత్త ఫోన్ కి సంబంధించి లభించిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Lava Blaze X డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ (అంచనా)

91mobiles లీక్ ప్రకారం, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలిసింది. అది టీజర్ తో కన్ఫర్మ్ అయ్యింది.

Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని సమాచానం. ఇంకా ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా వాడనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Lava Blaze X బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా 5జీ బ్రాండింగ్ ఉంది.

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.