Lava Blaze X: జులై 10న భారత్‌లో లాంచ్ అవుతోన్న లావా బ్లేజ్ ఎక్స్

Highlights

  • Lava Blaze X ఇండియా లాంచ్ ఖరారు
  • జులై 10న భారత్ లో విడుదల
  • 120 హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. Lava Blaze X పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 10వ తేదీన ఈ ఫోన్ విడుదలవుతోంది. ఓసారి Lava Blaze X యొక్క లాంచ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava Blaze X ఇండియా లాంచ్ తేదీ

Lava Blaze X స్మార్ట్‌ఫోన్ భారత్ లో జులై 10వ తేదీన లాంచ్ అవుతుందని లావా సంస్థ అధికారికంగా ప్రకటించింది. డివైజ్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ జులై 10న మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ అవుతాయి. వర్చువల్ గా జరిగే ఈవెంట్ ద్వారా Lava Blaze X మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రత్యక్షప్రసారాన్ని లావా మొబైల్స్ వెబ్‌సైట్ మరియు లావా యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చూడవచ్చు.

Lava Blaze X స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Lava Blaze X లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Lava Blaze X లో ఏ చిప్సెట్ వాడారో ఇంకా తెలియదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze X డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Lava Blaze X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి సోని ఐఎంఎక్స్682 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ లైట్ ఇస్తున్నారు.

బ్యాటరీ: Lava Blaze X లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.