వచ్చేసింది JioTV Watchparty ఫీచర్, ప్రస్తుతానికి క్రికెట్ ఈవెంట్స్ కే పరిమితం

హైలైట్స్:

  • జియోటీవీ వాచ్ పార్టీ ఫీచర్ ను ప్రకటించిన జియో
  • ఇకపై దూర ప్రాంతాల నుంచైనా, స్నేహితులు, కుటుంబంతో కలిసి లైవ్ గా ఈవెంట్స్ ను చూసే అవకాశం
  • జియోటీవీ వాచ్ పార్టీ ఫీచర్ ప్రస్తుతానికి క్రికెట్ ఈవెంట్స్ మాత్రమే పరిమితం

టెలీకామ్ దిగ్గజం, జియో సొంతంగా ఎన్నో యాప్స్ ని కలిగి ఉంది. వాటిలో జియో సినిమా, జియో టీవీ, జియో సావన్ వంటివి మరెన్నో ఉన్నాయి. జియో సినిమాలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో యూజర్లు ఆయా అప్లికేషన్లను వేరుగా ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా, జియోటీవీ ద్వారా టీవీ ఛానెళ్ళను.. అంటే క్రికెట్, డైలీ సీరియళ్ళు, వార్తలు ఇలా మరెన్నింటినో లైవ్ గా చూసే వెసులుబాటు ఉంది. ఈ యాప్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్, ఐవోఎస్, జియో ఫోన్ ఓఎస్ లకు అందుబాటులో ఉన్నాయి. జియో కస్టమర్లు ఈ యాప్స్ ని ఉచితంగా వాడుకోవచ్చు. తాజాగా జియో కంపెనీ జియోటీవీ వాచ్ పార్టీ ఫీచర్ ను ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాల నుంచైనా సరే, ఈవెంట్స్ ని లైవ్ గా తిలకించవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లు జియోటీవీ వాచ్ పార్టీ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం కేవలం క్రికెట్ ఈవెంట్స్ కి మాత్రమే పరిమితం. రానున్న రోజుల్లో మిగతా కంటెంట్ కి కూడా ఈ ఫీచర్ ను జియో కంపెనీ విస్తరిస్తుందని ఆశిద్దాం.

Credits: TelecomTalk

జియోటీవీ వాచ్ పార్టీ (JioTV Watch Party)

ఎట్టకేలకు జియోటీవీ వాచ్ పార్టీ ఫీచర్ ను ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం క్రికెట్ ఈవెంట్స్ కే పరిమితం. మీరు ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, స్క్రీన్ క్రింద మీకు వాచ్ పార్టీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ ఐకన్ పై మీటితే చాలు. మీరు సొంతంగా మీ యొక్క వాచ్ పార్టీని క్రియేట్ చేయవచ్చు. లేదంటే, మీ స్నేహితులు/కుటుంబ సభ్యులు క్రియేట్ చేసిన ఏదైనా వాచ్ పార్టీలో లింక్ ద్వారా మీరు చేరవచ్చు.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జులై 17 న మాంచెస్టర్ లో జరగబోవు చివరిదైన మూడో వన్డేను మీరు జీయోటీవీ వాచ్ పార్టీ మోడ్ లో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చు. ఓసారి ప్రయత్నించండి. అయితే ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పై లేటెస్ట్ వర్షన్ జియోటీవీ యాప్ మీ వద్ద ఉండే విధంగా చూసుకోండి. సమీప భవిష్యత్తులో జియో, ఈ ఫీచర్ ను మిగతా కంటెంట్ కు కూడా వర్తింపజేస్తుందని ఆశిద్దాం. జియో టీవీ యూజర్లు, జియో మీట్ ద్వారా కూడా వాచ్ పార్టీ ఫీచర్ ను ఎనేబుల్ చేయవచ్చు.

జియో మీట్ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. జియో మీట్ అనేది వీడియో కాన్ఫెరెన్సింగ్ ప్లాట్ఫామ్. ఇది యాప్ రూపంలో మీకు అందుబాటులో ఉంది. దీన్ని వెబ్ సైట్ ద్వారా యాక్సెస్ చేసేందుకు వీలుంది.