Jio రూ.61 డేటా బూస్టర్ రీచార్జ్ ప్లాన్‌తో 10జిబి డేటా; వివరాలు తెలుసుకోండి!

Highlights

  • రూ.61 డేటా బూస్టర్ ప్యాక్ డేటా పరిధిని పెంచిన జియో
  • ప్రస్తుతం యూజర్ కి లభించనున్న 10జిబి డేటా
  • ఐపీఎల్ చూసే వారికి ఈ ప్యాక్ ఎంతో ప్రయోజనకరం

Jio డేటా బూస్టర్ ప్యాక్ అయిన రూ.61 రీచార్జ్ ప్లాన్ ద్వారా ఇప్పుడు యూజర్లకు ఎక్కువ డేటా లభించనుంది. అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇంతకు ముందు ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 6జిబి డేటా లభించేది. ఇప్పుడు జియో చేసిన మార్పుతో ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 10జిబి లభిస్తుంది.

ఐపీఎల్ టోర్నీ చివరి వారంలోకి ప్రవేశించిన తరుణంలో ఈ ప్లాన్ అడుగుపెట్టింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్స్‌ట్రా డేటా ద్వారా మ్యాచెస్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. సరే, ఓసారి జియో డేటా బూస్టర్ ప్యాక్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రూ.61 జియో డేటా బూస్టర్ ద్వారా ఇప్పుడు మరింత ఎక్కువ డేటా

  • రూ.61 డేటా బూస్టర్ ప్లాన్
  • 10జిబి డేటా ప్రయోజనం

ఐపీఎల్ 2023 చివరి అంకంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో టెలీకామ్ దిగ్గజం జియో తన డేటా బూస్టర్ ప్యాక్స్ డేటా పరిధిని పెంచింది. 5 జియో డేటా బూస్టర్ ప్యాక్స్ లో ఒకటైన రూ.61 ప్యాక్ డేటా లిమిట్ ని 4జిబి కి పెంచింది. అంటే గతంలో 6జిబి డేటా వస్తుండగా ఇప్పుడు ఈ ప్యాక్ ద్వారా 10జిబి డేటా యూజర్ కి లభించనుంది. ఈ ప్యాక్ ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు.

జియో వద్ద మరొక 4 డేటా బూస్టర్ ప్యాక్స్ ఉన్నాయి. అవి: రూ.15, రూ.25, రూ.121 మరియు రూ.222. రూ.15 విలువజేసే జియో డేటా బూస్టర్ ప్యాక్ ద్వారా యూజర్ కి ఒక గిగాబైట్ అదనపు డేటా లభిస్తుంది. ఒక రాత్రితో డేటా ముగుస్తుందనగా ఈ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చేసేందుకు మరింత డేటా కావాలంటే అప్పుడు రూ.25 డేటా బూస్టర్ ప్యాక్ మీకు బాగా సరిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 2జిబి అదనపు డేటా లభిస్తుంది. ఇక రూ.121 విలువగల డేటా బూస్టర్ ప్యాక్ ద్వారా యూజర్ కి 12జిబి అదనపు డేటా లభిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మరియు రోజు అధిక డేటా వాడేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

చివరగా రూ.222 జియో డేటా బూస్టర్ ప్యాక్ హెవీ యూజర్లకు పని చేస్తుంది. పెద్ద ఫైల్స్ ని డౌన్‌లోడ్ లేదా అప్‌లోడ్ చేసే వారికి, యూట్యూబ్ లో వీడియోస్ అప్‌లోడ్ చేసే వారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ డేటా బూస్టర్ ప్యాక్స్ వ్యాలిడిటీ యూజర్ యొక్క మెయిన్ యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు పని చేస్తాయి.