Jio రూ.533 ప్లాన్: JioTv, JioCinema తో పాటు మరెన్నో బెనిఫిట్స్

హైలైట్స్

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ Jio
  • రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఉచిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ తో పాటు మరెన్నో బెనిఫిట్స్
  • అదనపు బెనిఫిట్స్ లో భాగంగా జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను ఉచితంగా అందిస్తోన్న జియో

భారతదేశంలో టెలీకామ్ రంగంలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికీ జియో పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు. నానాటికీ జియో వైపుగా కస్టమర్లు మరలుతున్నారు. జియో క్రియేట్ చేసిన ప్రభంజనం అటువంటిది. జియో రంగ ప్రవేశం తర్వాత మార్కెట్ లో ఆదిపత్యం చెలాయిస్తోన్న ఎయిర్టెల్ కి తొలినాళ్ళలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే తర్వాతి కాలంలో మళ్ళీ ఎయిర్టెల్ కోలుకుని జియోకి పోటీనిస్తోంది.

Jio సంస్థ తన యూజర్ల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్స్ జియో వద్ద ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్లాన్స్ లో ఒకటి రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు డేటా, కాల్స్, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ లతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. సరే, రూ.533 ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

  • 56 రోజుల వ్యాలిడిటీ
  • 112జిబి డేటా (డెయిలీ 2జిబి డేటా)
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత ఉచిత కాల్స్
  • జియోటీవీ
  • జియోసినిమా
  • జియోసెక్యూరిటీ
  • జియోక్లౌడ్

జియో అందిస్తోన్న రూ.533 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే మొత్తం 112జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా డెయిలీ 2జిబి చొప్పున యూజర్ కి అందజేయబడుతుంది. 56 రోజుల పాటు ప్రతిరోజూ 2జిబి డేటాను యూజర్ ఉపయోగించుకోవచ్చు. 2జిబి డేటా పరిధి పూర్తయ్యాక డేటా స్పీడ్ 64కేబీపీఎస్ కి పడిపోతుంది. అయితే ఈ స్పీడ్ తో బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా రూ.533 ప్లాన్ ద్వారా యూజర్ కి డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రూ.533 ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.533 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన వాల్యూ ఫర్ మనీ ప్లాన్ అయిన రూ.533 ప్లాన్ ద్వారా డేటా, కాల్స్, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ వంటి బెనిఫిట్స్ తో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా పొందవచ్చు.

జియో రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా? మరోసారి ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను చదివి, ప్లాన్ మీకు సరిపోతుంది అనుకుంటే రీచార్జ్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.